తెలంగాణ

telangana

ETV Bharat / videos

సీఎం రేవంత్​రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వెంకటేశ్​ - Suresh Babu meets CM Revanth Reddy

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2024, 7:04 PM IST

Venkatesh and Suresh Babu meets CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు వెంకటేశ్​, ఆయన సోదరుడు సినీ నిర్మాత సురేశ్​ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఫొటోలు దిగారు. ఇవాళ ముఖ్యమంత్రి నివాసంలో ఈ భేటీ జరిగింది. రేవంత్​ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనను వెంకటేశ్​, సురేశ్​ బాబు కలవడం ఇదే తొలిసారి. ముగ్గురు కాసేపు​ సరదాగా మాట్లాడుకున్నారు. మర్యాద పూర్వకంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామని, ఎలాంటి ప్రత్యేకమేమీ లేదని సురేశ్ ప్రొడక్షన్ సిబ్బంది తెలిపారు. 

Venkatesh Saindhav Movie : మరోవైపు సినీ నటుడు వెంకటేశ్​ నటించిన 75వ చిత్రం సైంధవ్​ సంక్రాంతికి విడుదలైంది. వెంకటేశ్​ నటన, యాక్షన్​ సన్నివేశాలు, నవాజుద్దీన్​ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని  డైరెక్టర్​ శైలేశ్​ కొలను తెరకెక్కించారు. ఫిబ్రవరి 9 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైవ్​లో విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details