'వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వం కోల్పోయింది - అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాలి' - Vasantha Krishna Election Campaign - VASANTHA KRISHNA ELECTION CAMPAIGN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 16, 2024, 3:58 PM IST
Vasantha Krishna Prasad Election Campaign : ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. కూటమి తరపున తెలుగుదేశం అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ గొల్లపూడి శివారు సూరాయపాలెంలో ప్రచారం ప్రారంభించారు. ముందుగా గ్రామంలో మహాలక్ష్మమ్మ తల్లిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా తనతోపాటు విజయవాడ పార్లమెంటు అభ్యర్ధి కేశినేని శివనాథ్ (చిన్ని)కి కూడా అమూల్యమైన సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
రాష్ట్రాభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సర్వం కోల్పోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాలన్నారు. అలాగే సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌తో పాటు తెలుగుదేశం సీనియర్ నేత పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు, జన సైనికులు, వీర మహిళలు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు.