ఆర్నెళ్లైనా రోడ్డు ప్రమాద బాధితులకు అందని పరిహారం - rtc bus road accident
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 7:30 PM IST
Unpaid Compensation to Road Accident Victims : ప్రమాదం జరిగి ఆరు నెలలు అవుతున్నా బాధితులకు ప్రభుత్వం ఇంకా నష్టపరిహారం అందించలేదు. గత ఏడాది ఆగస్టు 20న విశాఖ నుంచి పాడేరు వస్తున్న ఆర్టీసీ బస్సు మలుపు వద్ద చెట్టు కొమ్మను తప్పించబోయి అదుపు తప్పి 150 అడుగుల లోయలో పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, 35 మంది క్షతగాత్రులయ్యారు. వీరిని పాడేరు ఆసుపత్రికి తరలించగా స్థానిక అధికారులు, మంత్రి అమర్నాథ్ పరామర్శించారు. చనిపోయిన వారికి రూ.10 లక్షలు, తీవ్రగాయాలు అయిన వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు పరిహారం ఇస్తామని మంత్రి అమర్నాథ్ ప్రకటించారు.
బాధితులను ఆసుపత్రిలో పరామర్శించి పరిహరం మాత్రమే ప్రకటించారు. కానీ ఇంత వరకు ఒక్క రూపాయి కూడా అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పరిహారం చెల్లించాలని అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదని బాధితులు వాపోయారు. ప్రమాద బారిన పడి నెెలల తరబడి ఆసుపత్రిలో ఉండి వచ్చామని పేర్కొన్నారు.