LIVE : ఇందూరులో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం - ప్రత్యక్ష ప్రసారం - NATIONAL TURMERIC BOARD
Published : Jan 14, 2025, 11:59 AM IST
National Turmeric Board : నిజామాబాద్‌లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా జాతీయ పసుపు బోర్డు ప్రారంభించారు. ఈ విషయం పట్ల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రత్యక్షంగా, లేఖల ద్వారా పదేపదే పసుపు రైతుల ప్రయోజనాల కోసం బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఙప్తులు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఇది నిజామాబాద్ జిల్లా రైతుల విజయమని, వారి పోరాటాలకు రాష్ట్ర ప్రభుత్వం మద్ధతు పలకడంతో పసుపు బోర్డు వచ్చిందన్నారు. ఏర్పాటుకు పోటీలో ఉన్న అన్ని రాష్ట్రాలను, నగరాలను కాదని నిజామాబాద్ లో ఏర్పాటు చేయడం ఆనందదాయకమని మంత్రి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. పసుపు బోర్డును ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది అక్టోబరు 4న కేంద్ర వాణిజ్య శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఛైర్మన్‌గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది.