ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నిరుద్యోగుల ఓదార్పు యాత్ర- 'ఎన్నికలకు ముందే హామీలు అమలు చెయ్యాలి'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 5:47 PM IST

unemployees Console yatra in Visakha : రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులను ఓదార్చేందుకు ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో విశాఖలో ఓదార్పు యాత్ర ప్రారంభించారు. గత హామీ ప్రకారం 2,32,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు సహా ప్రతీ నిరుద్యోగ (unemployees) యువతను ప్రత్యక్షంగా కలిసి వారి ఆవేదనను ప్రభుత్వం, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకు వెళ్లేందుకు అభిప్రాయ సేకరణ ప్రారంభించారు. కరపత్రాలు పంచారు. 

లక్ష ఉద్యోగాలతో మెగా డీఎస్సీ, 26వేల ఉద్యోగాలతో పోలీస్ శాఖ, 15004 సచివాలయాల్లో డిజిటల్ గ్రంథాలయ ఉద్యోగాలు భర్తీ చేయాలని, 2023 ఫిబ్రవరి 22న పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష రాసిన వారికి ఐదు గ్రేస్ మార్కులు ప్రకటించాలని, డీఎస్సీలో పీఈటీ, గ్రంథాలయ పోస్టులు భర్తీ చేయాలి, టెట్ (TET) , డీఎస్సీకి  (DSC) మధ్య నెల రోజులు వ్యాధి పెంచాలని, 2024 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టబోయే అన్ని నిరుద్యోగ హామీలను ఇప్పుడే అమలు చేయాలని తర్వతే ఓట్లు అడగాలని హేమంత్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details