శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 96వ వార్షిక మహాసభలు - ఆధ్యాత్మిక పీఠం 96వ వార్షిక మహాసభలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 8, 2024, 8:32 PM IST
Umar Alisha Mahasabhalu Started On Feb 9th to 11th 3 days : ఈ నెల 9, 10, 11 తేదీల్లో పిఠాపురంలోని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 96వ వార్షిక మహాసభలు నిర్వహించనున్నట్లు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 552 సంవత్సరాలుగా దేశ సమగ్రత విశ్వమానవ శాంతి కొరకు పీఠం పాటుపడుతుందని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో పీఠం ఆశయాలు ప్రతిబింబించే విధంగా 28 స్టాల్స్ ఏర్పాటు జరుగుతుందన్నారు.
Alisha Mahasabhalu 2024 : రెండు తెలుగు రాష్ట్రాల్లో 108 ఆశ్రమ శాఖల ద్వారా మహా మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధనలతో కూడిన త్రయీ సాధన ద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పీఠం నిర్వాహకులు ఉమర్ అలీషా తెలిపారు.