తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి- టీటీడీ నూతన ఈవో శ్యామలరావు - TTD EO Shyamalarao Takes Charge - TTD EO SHYAMALARAO TAKES CHARGE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 16, 2024, 5:34 PM IST
|Updated : Jun 16, 2024, 5:58 PM IST
TTD EO Shyamalarao Takes Charge: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జె. శ్యామలరావు బాధ్యతలు చేపట్టారు. క్షేత్ర సంప్రదాయం పాటిస్తూ ముందుగా వరాహస్వామిని దర్శించుకుని అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మాజీ ఈవో ధర్మారెడ్డి అధికారికంగా బాధ్యతలను శ్యామలరావుకు అప్పగించారు. శ్రీవారిని సతీసమేతంగా దర్శించుకున్న నూతన ఈవో శ్యామలరావు దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం చేశారు. జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమి వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా టీటీడీ ఈవో కావటం తన అదృష్టంగా భావిస్తున్నాని శ్యామలరావు అన్నారు. ఈవోగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. టీటీడీలో పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తామన్న ఆయన తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి చేపడతామన్నారు. దర్శనానికి వచ్చినవారు ఇబ్బంది పడకుండా వసతులు కల్పిస్తామని పేర్కొంటూ ఎక్కడైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలన్నారు.
"తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈవోగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు. టీటీడీలో పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తాం. తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెడతాం. దర్శనానికి వచ్చినవారు ఇబ్బంది పడకుండా వసతులు కల్పిస్తాం. ఎక్కడైనా సమస్యలుంటే మా దృష్టికి తేవాలి." - శ్యామలరావు, టీటీడీ ఈవో