శాసనసభ ఉన్నంత వరకు శ్రీపాద రావును స్మరించుకుంటూనే ఉంటాం : కోమటిరెడ్డి వెంకటరెడ్డి - Duddilla Sripadarao In Assembly
Published : Mar 2, 2024, 2:08 PM IST
Tribute To Former Speaker Duddilla Sripadarao : మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావుకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఘనంగా నివాళులు అర్పించారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతి వేడుకల కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌లు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. శ్రీపాదరావు స్పీకర్‌గా ఉన్న సమయంలో తాను అసెంబ్లీలో లేనందుకు బాధగా ఉందని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. శాసనసభ ఉన్నంత వరకు శ్రీపాద రావును స్మరించుకుంటూనే ఉంటామని పేర్కొన్నారు.
Komati Reddy Venkata Reddy : తాను ఎన్‌ఎస్‌యూఐలో ఉన్నప్పటి నుంచి మాజీ స్పీకర్ దివంగత శ్రీపాదరావుతో అనుబంధం ఉన్నట్లు రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. శ్రీపాదరావు అజాత శత్రువని మంత్రి వెంకట్‌రెడ్డి అభివర్ణించారు. శ్రీపాద రావు పేరును మంత్రి శ్రీధర్ బాబు నిలబెడుతున్నారని కొనియాడారు. ఆలస్యమైనా శ్రీపాదరావు జయంతిని అధికారికంగా జరపడం చాలా సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.