ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సెంట్రల్​ జైలులో గిరిజన ఖైదీ అనుమానాస్పద మృతి - న్యాయం చేయాలంటూ బాధితుల డిమాండ్​ - Tribal Prisoner Died Central Jail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 7:00 PM IST

Tribal Prisoner Died Suspiciously in Visakhapatnam Central Jail : విశాఖ సెంట్రల్​ జైలులో ఓ గిరిజన ఖైదీ అనుమానాస్పదంగా మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులే కొట్టి చంపారంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాల్సిందేనంటూ కేజీహెచ్​ మార్చురీ ఎదుట బాధితుడి కుటుంబం ఆందోళనకు దిగారు. మరో మూడు రోజుల్లో బెయిల్​పై విడుదల కావాల్సిన వ్యక్తి మృతి చెందడం వల్ల తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

గత సంవత్సరం జూలై 23న కోడ పోత్తన్న (45) గంజాయి స్మగ్లింగ్​ చేస్తున్నాడనే అనుమానంతో పోలీసులు కేసును నమోదు చేశారని విశాఖ ఆర్డీవోకి ఇచ్చిన లేఖలో కోడ తులమ్మ పేర్కొంది. అనంతరం అతని కోర్టులో హజరుపరచగా మేజిస్ట్రేట్​ 6 నెలలు రిమాండ్​కు పంపించారని తెలిపారు. ఈ నెల 6న (ఫిబ్రవరి 6న)  జైల్​ అధికారులు ఫోన్​ చేసి తన భర్తకు ఆరోగ్యం బాగాలేదని ఆమె తమ్ముడికి  తెలిపినట్లు వివరించారు. కొద్ది సమయం అనంతరం ఫోన్​ చేసి ఆమె భర్త చనిపోయారని తెలిపినట్లు పేర్కొన్నారు. పోత్తన్న శరీరంపై గాయాలు, ముఖం వాచినట్లు ఉండటం వల్ల పలు అనుమానాలకు తావిస్తోందని వివరించారు. ఈ విషయంపై న్యాయ విచారణ జరిపించి, తమకు న్యాయం చేయాలని ఆర్డీవోను బాధితులు కోరుకున్నారు. లేకుంటే కలెక్టర్​ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details