తిరుమలగిరి మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం - భారీగా ట్రాఫిక్ జాం - Paddy Procurement in Telangana 2024 - PADDY PROCUREMENT IN TELANGANA 2024
Published : Apr 13, 2024, 11:22 AM IST
Traffic Jam at Tirumalagiri Agricultural Market : సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌కు రికార్డు స్థాయిలో ధాన్యం వచ్చింది. దీంతో పట్టణంలో ధాన్యం వాహనాలతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. సుమారు రెండు గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వరుసగా మూడు రోజులు సెలవులు వస్తుండటంతో ఈరోజు తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌కు అన్నదాతలు పోటెత్తారు. మార్కెట్ నుంచి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు వాహనాలు బారులు తీరాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
Paddy Procurement in Telangana 2024 : మరోవైపు ధాన్యం కొనుగోళ్లపై శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్ల దగ్గర రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ధాన్యాన్ని ఆరబెట్టి తేవాలని, ఇందుకోసం అన్నదాతలను చైతన్య పరచాలని సంబంధిత యంత్రంగానికి సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.