ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎత్తిపోతలకు జలకళ - సందర్శకులను ఆకటుకుంటున్న జలపాతం - Tourist at Ethipothala Waterfall - TOURIST AT ETHIPOTHALA WATERFALL

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 9:13 AM IST

Tourist Rush at Ethipothala Waterfalls : నాగార్జున సాగర్‌ డ్యామ్‌ నిండు కుండలా మారడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ బిరబిరా దిగువకు పరుగులు తీస్తోంది. ఆ దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు ప్రాజెక్టు వద్దకు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో పల్నాడు జిల్లాలోని సాగర్‌ అందాలను, ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎత్తిపోతల జలపాతం సరికొత్త ప్రకృతి అందాలతో ఆహ్లాదంగా మారడంతో కుటుంబ సభ్యులతో ప్రజలు సందడిగా గడిపారు. పరిసర ప్రాంతాలు సహా హైదరాబాద్‌ నుంచి పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో ఈ ప్రాంతం పర్యాటక శోభను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో 70 అడుగుల ఎత్తైన ఎత్తిపోతల జలపాతం నుంచి పారుతున్న వరద నీరు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎత్తిపోతల జలపాతం పరిసరాల్లో పచ్చటి ఆహ్లాదకర వాతావరణం నెలకొనడంతో పెద్దలు, చిన్నారులు, యువత జలపాత అందాలను వీక్షిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. జలకళతో పర్యాటక తాకిడితో పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఎత్తిపోతల వద్ద వాతావరణం ఆకట్టుకుంటుందని పర్యాటకులు తెలుపుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details