ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పొగాకు కొత్త వంగడంపై రైతన్నలకు అవగాహన సదస్సు - వర్జినియా పొగాకు వంగడాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 7:52 PM IST

Tobacco New Seeds Awareness Camp By CTRI : నాణ్యమైన వర్జినియా పొగాకు వంగడాలను అందించి తద్వారా రైతు ఆర్థిక స్వావలంబన సాధించేలా కృషి చేస్తామని కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ (సీటీఆర్ఐ) డైరెక్టర్ డాక్టర్​ మాగంటి శేషు మాధవ్ అన్నారు. సీటీఆర్ఐ సభ్యులు బృందంగా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్​సీజే11 వంగడాన్ని గతేడాది విడుదల చేయడం జరిగిందని దీన్ని ఏలూరు జిల్లాలోని మార్కండేయపురంలో రైతు కూచిపూడి రమేష్ సుమారు 5 ఎకరాల్లో విస్తీర్ణంలో సాగు చేయగా మంచి ఫలితాన్ని ఇచ్చిందన్నారు. 

ఒక్క మొక్కకి 30 నుంచి 35 ఆకులు ఉంటాయని ఎకరాకు 14 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకోవడతో పాటు మంచి నాణ్యత ప్రమాణాలతో పొగాకు పంట ఉంటుందని తెలిపారు. దీనికి చీడ పీడల బెడద కూడా తక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ రకమైన వంగడం రైతులకు లాభసాటిగా ఆశాజనకంగా ఉంటుందని అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details