LIVE : టీటీడీ ఛైర్మన్‌గా నియమితులైన బీఆర్ నాయుడు మీడియా సమావేశం - TTD CHAIRMAN BR NAIDU PRESS MEET
Published : Oct 31, 2024, 10:11 AM IST
|Updated : Oct 31, 2024, 10:20 AM IST
TTD Chairman BR Naidu Press Meet : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి నూతన ఛైర్మన్‌గా టీవీ - 5 ఛైర్మన్ బీఆర్ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో టీటీడీ పాలకమండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు దక్కగా, తెలంగాణ నుంచి ఐదుగురికి, తమిళనాడుకు నుంచి ఇద్దరికి, కర్ణాటక నుంచి ముగ్గురికి, గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి చోటు దక్కింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీటీడీ మెంబర్‌గా ఎంపిక కావడంతో నెల్లూరులోని ఆమె ఇంటి వద్ద సందడి నెలకొంది. టీడీపీ నాయకులు, వేమిరెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాణాసంచాకాల్చి సందడి చేశారు. స్వీట్లు పంచారు. టీటీడీ ఛైర్మన్‌గా తనను నియమించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బీఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్‌కి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Oct 31, 2024, 10:20 AM IST