ఆర్టీసీ బస్సు డ్రైవర్ సహా మహిళా కండక్టర్‌పై యువకుల దాడి - వీడియో వైరల్ - Attack on RTC Bus Driver in Hyd - ATTACK ON RTC BUS DRIVER IN HYD
Published : Aug 2, 2024, 1:19 PM IST
Youth attack on RTC Bus Driver in Hyderabad : హైదరాబాద్ బేగంబజార్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై ముగ్గురు యువకులు దాడి చేశారు. బస్సు దిల్సుఖ్నగర్ నుంచి కర్ణాటకలోని బీదర్‌కు వెళ్తుండగా ఎంజే మార్కెట్ వద్ద వెనక నుంచి ఓ బైక్‌కు తాకగా వాహనంపై ఉన్న ముగ్గురు యువకులు కింద పడిపోయారు. దీంతో ఒక్కసారిగా ఆవేశానికి గురైన యువకులు, బస్సులోకి ఎక్కి డ్రైవర్ లక్ష్మయ్యపై దాడి చేశారు.
Police Arrest Two Youth for attack on RTC Driver and Conductor : అడ్డుకోవడానికి వెళ్లిన కండక్టర్ అంజమ్మపై సైతం దాడికి పాల్పడ్డారు. వెంటనే అక్కడి నుంచి యువకులు బైక్‌పై పరారయ్యారు. డ్రైవర్, కండక్టర్‌కు గాయాలవ్వడంతో బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా యువకులు వంశీ, రాహుల్‌ను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మరొక యువకుడు అనిరుధ్ పరారీలో ఉన్నట్లు బేగంబజార్ సీఐ విజయ్ కుమార్ వెల్లడించారు.