ప్రీ-లాంచ్ పేరుతో 350మందికి టోపీ పెట్టిన రియల్టీ సంస్థ - EOW DCP Interview On Free Launch - EOW DCP INTERVIEW ON FREE LAUNCH
Published : May 18, 2024, 8:43 PM IST
EOW DCP Interview On Free Launch : ప్రీ-లాంచ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేశామని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ(ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్) డీసీపీ ప్రసాద్ తెలిపారు. భారతి లేక్ వ్వూ ప్రీ-లాంచర్ పేరుతో దాదాపు రూ.50 నుంచి 60 కోట్లు వసూలు చేశారని ఆయన తెలిపారు. చాలా మంది వీరి వల్ల మోసపోతున్నారు. వీరు టెలికాలర్లతో ఫోన్చేయించి మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు.
భారతి లేక్ వ్యూ వారి ఆఫీసు మాదాపూర్లో ఉంది. ఈ పీరియడ్లో బుక్ చేసుకుంటే మీకు లాభం చేకూరుతుందని చెప్పి మోసగిస్తున్నారని తెలిపారు. అసలు వీళ్లు ఎవరు? వీరికి రెరా అనుమతులు ఉన్నాయా? తదితర విషయాలను పరిశీలించాక మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 350 పైగా బాధితులు ఉన్నారని అన్నారు. ప్రీ లాంచ్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న సైబరాబాద్ ఈవోడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ తో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి.