ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

దేవాలయ వ్యవస్థను దిగజార్చిన ఘనత జగన్​ ప్రభుత్వానిదే: శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి - SIVASWAMY EXCLUSIVE INTERVIEW - SIVASWAMY EXCLUSIVE INTERVIEW

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 2:00 PM IST

Thallapalem Sivaswamy Exclusive Interview on YSRCP Leaders Attacks on Priests : కాకినాడలో అర్చకుడిపై వైఎస్సార్సీపీ నేత దాడి కలకలం రేపింది. రాష్ట్రమంతా అధికార వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ నేతల ప్రవర్తనను ఖండించారు. పలువురు ప్రతిపక్ష నేతలు అర్చకుడికి అండగా నిలిచారు.  అర్చకులు, పురోహితులపై వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు రౌడీల్లా దాడులకు తెగ బడుతూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న ఘటనలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి.

YSRCP Ex Corporator Attacked On Priests : రాష్ట్రంలో అర్చకులపై అధికారపక్ష ప్రతినిధుల దాడులు అత్యంత హేయమని తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామి అన్నారు. ప్రజలతో పాటు దేవాలయాల్లోని అర్చకులు కూడా వాక్ స్వాతంత్య్ర హక్కును కోల్పోయే పరిస్థితిని ప్రస్తుత ప్రభుత్వం (Government) తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయ (Temple) వ్యవస్థను దిగజార్చిన ఘనత ప్రభుత్వ పెద్దలదేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సుపరిపాలన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్న శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామితో  ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details