ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కనకదుర్గమ్మకు ఆషాడం సారె- వేడుకగా సమర్పించిన ఆలయ ఇంజినీరింగ్‌ సిబ్బంది - Ashadam Sare To Kanaka Durga - ASHADAM SARE TO KANAKA DURGA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 29, 2024, 7:03 PM IST

Temple Engineering Staff Present Ashadam Sare To Vijayawada Kanaka Durga : విజయవాడ కనకదుర్గమ్మకు ఆలయ ఇంజినీరింగ్‌ సిబ్బంది ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని పవిత్ర సారె సమర్పించారు. ఆలయ ఈవో కేఎస్​ రామారావును ముఖ్య అతిధిగా ఆహ్వానించి ఇంజినీరింగ్ సిబ్బంది ఆయనను సత్కరించారు. అనంతరం జమ్మిదొడ్డి లోని దేవతా మూర్తుల వద్ద ఆలయ వైదిక సిబ్బందితో పూజలు చేయించారు. ఈవో, డిప్యూటీ ఈవో, ఇంజనీర్లు కొబ్బరికాయలు కొట్టి సారెతో అమ్మవారి ఆలయం వరకు ప్రదర్శన చేశారు. 

కనకదుర్గనగర్​ మీదుగా అమ్మవారి మహామండపం ఆరో అంతస్తులో ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద సారె అందజేశారు. ఆలయ అర్చకులు పూజలు చేసి ఇంజినీరింగ్‌ సిబ్బందికి ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఆస్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, డిప్యూటీ ఈవో లీలాకుమార్, ఈఈ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. భక్తి శ్రద్దలతో అమ్మవారికి పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. అమ్మ వారికి సారె సమర్పించి ఆశీర్వాదం తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details