ఔను వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు - లండన్ యువతితో మంచిర్యాల యువకుడి ప్రేమ వివాహం - Telugu Boy Married London Girl - TELUGU BOY MARRIED LONDON GIRL
Published : Apr 4, 2024, 4:49 PM IST
Telugu Boy Married London Girl : ప్రేమ అన్న రెండు పదాల మాట సరిహద్దులను దాటి, మూడు ముళ్ల బంధంగా మారింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన కర్రె చంద్రయ్య, సరోజల చిన్న కుమారుడు రాజు మూడేళ్ల క్రితం లండన్ వెళ్లి అక్కడే వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే లండన్‌కు చెందిన డయానాతో రాజు ప్రేమాయణం సాగించారు. అది కాస్త వివాహం వైపుగా దారి తీసింది.
డయానాను భారత్‌లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన రాజుకు కలిగింది. అనుకున్నదే తడవుగా వీరిద్దరూ భారత్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆచార సంప్రదాయాల ప్రకారం వేదమంత్రాల నడుమ ఈ జంట నేడు ఒక్కటయ్యింది. బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ ఏఆర్ కన్వెన్షన్ ఇందుకు వేదికైంది. పెళ్లి వేడుకలను బంధువులంతా ఆసక్తిగా తిలకించారు. లండన్ నుంచి వధువు తల్లిదండ్రులు అనివార్య కారణాల వల్ల రాకపోవడంతో బెల్లంపల్లికి చెందిన బంధువులు కన్యాదానం చేసి తల్లిదండ్రుల వాత్సల్యాన్ని పంచారు. ఈ సందర్భంగా కన్యాదానం చేసిన దంపతులను అందరూ అభినందించారు.