జగన్ అరాచక పాలనపై పాటలు విడుదల చేసిన తెలంగాణ టీడీపీ నేతలు - TDP Released Songs - TDP RELEASED SONGS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 19, 2024, 10:15 PM IST
Telangana TDP Leaders Released Songs Against Jagan Ruling: ఏపీలో ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు రక్షణ కరవైందని, అన్ని వర్గాలను జగన్ అణగదొక్కారని తెలంగాణ తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో కేఎస్ రామారావు, కొడాలి వెంకటేశ్వర్ రావు, గుమ్మడి గోపాల కృష్ణలు రూపొందించిన నాలుగు పాటలను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీ జనార్ధన్‌తో పాటు పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, పాట నిర్మాతలు కెేఎస్ రామారావు, గుమ్మడి గోపాలకృష్ణ, కొడాలి వెంకటేశ్వర రావు సహా పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీడీ జనార్ధన్ మాట్లాడుతూ ఏపీలో జగన్ అరాచక పాలనకు ప్రతిబింబంగా ఈ పాటలు రూపొందించామని తెలిపారు. నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనలో జనం పడుతున్న అనేక రకాల ఇబ్బందులను స్పష్టంగా కళ్లకు కట్టేలా పాటల రూపంలో వివరించారని కొనియాడారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రం గాడినపడుతుందన్నారు. వీలైనంత ఎక్కువ మందికి చేరేలా పాటను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.