తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు - Telangana Liberation Day 2024 - TELANGANA LIBERATION DAY 2024

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2024, 8:33 AM IST

Updated : Sep 17, 2024, 10:56 AM IST

Telangana Liberation Day 2024 Celebrations Live :  తెలంగాణ విమోచన దినోత్సవానికి సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌ ముస్తాబైంది. హైదరాబాద్‌ సంస్థానం భారత సమాఖ్యలో విలీనమైన సెప్టెంబర్‌ 17ను, తెలంగాణ విమోచనం పేరిట కేంద్ర ప్రభుత్వం వేడుకల్ని నిర్వహిస్తోంది. బీజేపీ నిర్వహిస్తోన్న ఈ వేడుకల్లో హోంశాఖ మంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అమిత్ షా పోలీస్‌ అమరవీరుల స్మృతిస్థల్‌ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం పరేడ్​గ్రౌండ్స్​లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన, సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ క్రమంలోనే సాయుధ బలగాల గౌరవ వందనాన్ని అమిత్ షా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా ఇతర పార్టీ ప్రముఖులు​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కళారూపాలైన బతుకమ్మ, బోనాలు, పోతురాజులు, ఒగ్గుడోలు విన్యాసాలు, కోలాటం, తప్పెట, థింసా, లంబాడ నృత్యాలను ప్రదర్శించారు.
Last Updated : Sep 17, 2024, 10:56 AM IST

ABOUT THE AUTHOR

...view details