LIVE : తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు - ప్రత్యక్షప్రసారం - ASSEMBLY SESSIONS LIVE
Published : 6 hours ago
|Updated : 3 hours ago
Assembly Sessions Live : ఈ నెల 9న వాయిదా పడిన శాసనసభ శీతాకాల సమావేశాలు, ఇవాళ్టి నుంచి మళ్లీ మొదలు కానున్నాయి. వారం తర్వాత పునర్ ప్రారంభమవుతున్న సమావేశాలు, ఈ నెల 21 వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. సభ పని దినాలు, చర్చించాల్సిన అంశాలపై నేడు జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. శాసన సభ మొదలు కాగానే గంట పాటు ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఆ తర్వాత ఇటీవల మృతి చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతి దేవి, ఊకె అబ్బయ్య, రామచంద్రా రెడ్డికి సంతాపం ప్రకటిస్తారు. అనంతరం శాసన సభలో క్రీడా విశ్వవిద్యాలయ బిల్లు, విశ్వ విద్యాలయాల సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ శాఖలను చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బిల్లులను ప్రవేశ పెట్టనున్నారు. బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత ఉభయ సభల్లో పర్యాటక విధానంపై స్వల్ప కాలిక చర్చ చేపడతారు.
Last Updated : 3 hours ago