సివిల్స్‌లో సత్తాచాటిన తెలుగుతేజాలను అభినందించిన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ - Governor felicitates Civils Toppers - GOVERNOR FELICITATES CIVILS TOPPERS
Published : Apr 26, 2024, 12:09 PM IST
Governor Felicitates Civils Toppers : సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలను గవర్నర్ సీపీ రాధా కృష్ణన్ ఘనంగా సన్మానించారు. బీసీ స్టడీ సర్కిల్ తో కలిసి రాజ్‌భవన్ ఆధ్వర్యంలో 'ఇన్‌స్పైర్ 2024' పేరుతో సంస్కృతి కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2023 సివిల్స్‌లో జాతీయ స్థాయిలో ప్రతిభ చూపించిన అభ్యర్థులను అభినందించారు.
అనంతరం మాట్లాడిన గవర్నర్ సివిల్ సర్వీసెస్‌లో ఎంపికైన అభ్యర్థులు నిజాయితీ, నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు. సమాజానికి మంచి చేయటంలో ఎప్పుడూ వెనకడుగు వేయవద్దన్నారు. తెలుగు భాష గొప్పదనం గురించి మాట్లాడుతూ రాష్ట్రాలుగా విడిపోయినా సంస్కృతిలో అందరం ఒకటిగా కలిసి ఉన్నామని చెప్పారు. కాగా ఇటీవలే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ ఫలితాలను వెల్లడించింది. యూపీఎస్సీ విడుదల చేసిన జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ప్రతిభ చూపించారు. ఇప్పటికే సివిల్స్ విజేతలను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.