LIVE : తెలంగాణ శాసన సభ శీతాకాల సమావేశాలు - ప్రత్యక్షప్రసారం - TELANGANA ASSEMBLY LIVE
Published : 5 hours ago
Telangana Assembly Winter Session Live : అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఐదో రోజు కొనసాతున్నాయి. ఈ ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభమైంది. సభలో నేడు భూ-భారతి బిల్లు సహా రైతు భరోసా, రాష్ట్ర అప్పులపై చర్చ జరగుతోంది. శాసనసభలో ప్రశ్నోత్తరాలు తరువాత అటవీ అభివృద్ధి కార్పోరేషన్ లిమిటెడ్‌కు చెందిన గత ఆర్థిక ఏడాది వార్షిక నివేదిక మంత్రి కొండా సురేఖ ప్రవేశ పెడతారు. ఆ తరువాత.. "భూ భారతి'' బిల్లుపై చర్చ కొనసాగుతుంది. మున్సిపాలిటీల సవరణ బిల్లును సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెడతారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ సవరణ బిల్లు కూడా సీఎం రేవంత్‌రెడ్డి శాసన సభ ముందు ఉంచుతారు. పంచాయతీ రాజ్ సవరణ బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెడతారు. ఆ తరువాత రాష్ట్ర అప్పులు, రైతుభరోసా విధివిధానాలపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది. అటు శాసనమండలి కూడా ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. మండలిలో గురుకులాల మౌలిక వసతుల కల్పనపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది.