LIVE : గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మండలిలో చర్చ - ప్రత్యక్షప్రసారం - శాసనమండలి సమావేశాలు లైవ్
Published : Feb 9, 2024, 10:03 AM IST
|Updated : Feb 9, 2024, 10:41 AM IST
Telangana Assembly Sessions 2024 LIVE : రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి రోజున ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ శాసనసభ, మండలిలో చర్చ జరగుతోంది. ఉభయసభలు సమావేశం కాగానే నేరుగా చర్చ చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నారు. మరో సభ్యుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆ ప్రతిపాదనను బలపరుస్తున్నారు. అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CMRevanth Reddy) చర్చకు సమాధానం ఇస్తున్నారు. గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం ఉభయసభల ముందు పెట్టారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల పాటు నిర్వహించాలని గురువారం బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈనెల 9, 10, 12, 13వ తేదీల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత మొదటిసారి కొలువైన కాంగ్రెస్ సర్కార్ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.