ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబాస - టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల వాగ్వాదం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 5:19 PM IST

Narsipatnam Municipal Council Meeting: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. అభివృద్ది పనుల గురించి ప్రశ్నించిన టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దుర్భాషలాడుతూ విరుచుకుపడ్డారు. కాగా పట్టణంలో ఇటీవల కాలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి ఒకే వ్యక్తికి నామినేషన్ పద్ధతిలో పనులను కేటాయించడాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్లు నిలదీశారు. 

అదే విధంగా దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించిన విషయాన్ని సైతం టీడీపీ నేతలు గుర్తు చేశారు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దుర్బాషలాడుకున్నారు. అధికార పార్టీకి చెందిన వారికి మాత్రమే పనులు ఇస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. టెండర్ పద్ధతిలో పనుల కేటాయింపు జరగడం లేదని మండిపడ్డారు. సమావేశంలో ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లపై ఛైర్ పర్సన్ సుబ్బలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. సమావేశం రసాబాసాగా మారటంతో అర్ధాంతరంగా ముగించేశారని తెలుగుదేశం కౌన్సిలర్‌ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details