ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అసెంబ్లీ నుంచి సస్పెండ్​ చేస్తారా?: టీడీపీ - నిమ్మల రామానాయుడు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 3:44 PM IST

TDP MLA Suspended From Assembly: ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తితే అన్యాయంగా సస్పెండ్ చేశారని తెలుగుదేశం శాసనసభపక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. వాయిదా తీర్మానానికి పట్టుబడితే తమను సస్పెండ్ చేశారని వాపోయారు. సర్పంచులు నిధుల కోసం ఆందోళన నిర్వహిస్తే వారిని అరెస్టు చేయడం అమానుషమని దుయ్యబట్టారు. ప్రజా ఆందోళన ముందు ఏ ప్రభుత్వం నిలబడదని, జగన్ సభలకు డబ్బులు ఇచ్చి జనాన్ని తరలిస్తున్నా ప్రజలు సభల వద్ద ఉండడం లేదని అన్నారు. అరెస్టు చేసిన సర్పంచులను విడుదల చేయాలని, ప్రభుత్వం వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబడితే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం హేయమైన చర్య అని తెలుగుదేశం శాసనసభపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు దుయ్యబట్టారు. సీఎం జగన్ నిత్యవసర వస్తువుల ధరలు పెంచి, పేదల జేబులకు చిల్లు పెడుతున్నాడని మండిపడ్డారు. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం జగన్ సర్కార్ అని విమర్శించారు. ధరల పెరుగుదలపై చర్చకు పట్టుబడితే కుట్రపన్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి ప్రజలకు వాస్తవాలు తెలియకూడదని బయటకు పంపారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details