ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలులోకి తెచ్చారు : బుచ్చయ్య చౌదరి - Gorantla Buchaiah Chaudhary - GORANTLA BUCHAIAH CHAUDHARY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 14, 2024, 3:55 PM IST

TDP MLA Gorantla Buchaiah Chaudhary: సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అధికారం చేపట్టగానే అమలులోకి తెచ్చారని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పింఛన్లను 4వేలకు పెంచినట్లు బుచ్చయ్య చౌదరి తెలిపారు. చంద్రబాబు అధికారం చేపట్టగానే మెగా డీఎస్సీ, పింఛన్ల పెంపు, భూ హక్కు చట్టం రద్దు వంటి నిర్ణయాలతో ప్రజల్లో విశ్వాసం నింపారని ఆయన అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టామన్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతామని, తప్పులు చేసిన అధికారులను విడిచిపెట్టమని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని బుచ్చయ్య చౌదరి అన్నారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటామని బుచ్చయ్య పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అధికారులు కనీసం ప్రోటోకాల్‌ కూడా పాటించలేదని ఆయన విమర్శించారు. గతంలో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వలేదని బుచ్చయ్య మండిపడ్డారు. మంత్రి పదవి వస్తుందని ఆశించినా దక్కనందుకు బాధలేదన్న బుచ్చయ్య 42 ఏళ్లుగా తనను ఆదరించిన ప్రజలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details