జగన్ రెడ్డి హంతకుల నాయకుడు: మహాసేన రాజేశ్ - mahasena rajesh on ys jagan - MAHASENA RAJESH ON YS JAGAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 10, 2024, 7:21 PM IST
TDP Mahasena Rajesh Comments on YS Jagan: జగన్‌రెడ్డి హంతకుల నాయకుడని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్‌రెడ్డి అరాచకం ముందు ప్యాబ్లో ఎస్కోబార్ కూడా పనికిరాడని విమర్శించారు. అంబేడ్కరిజంపై దాడి చేసిన దళిత ద్రోహి జగన్ రెడ్డి అని మండిపడ్డారు. విజయవాడలో అంబేడ్కర్ విగ్రహంపై జగన్ పేరు తొలగింపులో, చంద్రబాబు, లోకేశ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. జగన్ పేరు అంబేడ్కర్ కాళ్ల కింద ఉండటానికి దళిత సమాజం ఒప్పుకోవడం లేదన్నారు.
అందుకే ఎవరో జగన్ రెడ్డి పేరును తొలగించారని వెల్లడించారు. పేరు తొలగింపుపై జగన్ అండ్ కో ఫేక్ ప్రచారం మొదలు పెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేశ్‌లపై విష ప్రచారం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇలా పేర్ల తొలగింపును తాను ఖడిస్తున్నానని అన్నారు. కానీ ఒక దళిత బిడ్డగా దళితులకు ద్రోహం చేసిన జగన్ పేరు తొలగింపునకు మద్దతిస్తున్నానని స్పష్టం చేశారు.