ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

డయేరియాపై మంత్రి విడదల రజిని వ్యాఖ్యలు విడ్డూరం: టీడీపీ నేతలు - TDP Leaders fire

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2024, 6:58 PM IST

TDP Leaders Fire on Minister Rajini about Diarrhea : గత కొన్ని రోజులుగా గుంటూరులో డయేరియా కేసులు పెరుగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. పైపు లైన్లు పాడైపోయిన చోట కొత్తవాటిని వేయడం, లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేయడంలో ఉదాసీనంగా ఉండటం వల్లే తాగునీరు కలుషితమవుతోందని నగరవాసులు అంటున్నారు. అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. తాజాగా గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో డయేరియా లక్షణాలతో బాధపడుతున్న బాధితులను తెలుగుదేశం నేతలు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులను గురించి ప్రభుత్వాసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్‌ కిరణ్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం బాధితులు కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. సుమారు 170 మంది వరకు డయేరియా లక్షణాలతో బాధితులు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా వైద్యులు నేతలకు వివరించారు. అయితే ఇందుకు విడ్డూరంగా ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మాటలు ఉన్నాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. శారదా కాలనీలో చనిపోయిన వ్యక్తి డయేరియాతో చనిపోకపోతే రూ.5 లక్షల పరిహారం ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నించారు. డయేరియా మరణాలకు మేయర్, కమీషనర్ బాధ్యత వహించాలని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details