ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'టీడీపీ పాలనలో అన్నివర్గాల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ' జోరుగా టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం - TDP leaders Election Campaign - TDP LEADERS ELECTION CAMPAIGN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 11:35 AM IST

TDP Leader Eluri Sambasivarao Election Campaign in Baptla : టీడీపీ పాలనలో అన్నివర్గాల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ చూపారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు(Eluri Sambasivarao) అన్నారు. చంద్రబాబు హయాంలో గ్రామీణ ప్రాంతాల ఉన్నతికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారని వెల్లడించారు. బాపట్ల జిల్లా చినగంజాం వండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. వైసీపీ దుష్టపాలన నుంచి విముక్తి కావాలంటే టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఏలూరి సమక్షంలో 50 కుటుంబాలు టీడీపీలో చేరారు.

TDP Leader Payyavula Keshav Election Campaign in Anantapur District : అనంతపురం జిల్లా ఉరవకొండలో తెలుగుదేశం అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ (Payyavula Keshav) ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ నిర్లక్ష్యం వలనే తాగునీటి సమస్య ఉత్పన్నమయ్యిందని తెలిపారు. అయిదేళ్ల సీఎం జగన్​ పాలనలో ఉరవకొండలో ఏమి అభివద్ధి జరిగిందో ప్రజలకు తెలియజేయాలని ఆ సందర్బంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఉరవకొండ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details