ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విలువలకు కట్టుబడి ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు దూరంగా ఉన్నాం: టీడీపీ - TDP LEADERS CLARIFY ON MLC ELECTION - TDP LEADERS CLARIFY ON MLC ELECTION

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 5:21 PM IST

TDP Leaders Clarify on Distanced From MLC Election Visakha: విలువలకు కట్టుబడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు. సులువుగా గెలిచే అవకాశం ఉన్నా, చంద్రబాబు ఆదేశాల మేరకు పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే శాసనసభలో ప్రతిపక్షం లేకుండా ప్రజలు తీర్పు ఇచ్చారని, కానీ శాసనమండలిలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించామని పేర్కొన్నారు. పోటీకి భయపడ్డారన్న వైఎస్సార్సీపీ నేతల వ్యాఖ్యలను పల్లా శ్రీనివాసరావు ఖండించారు. 

ప్రజలు అధికారం ఇచ్చింది రాష్ట్రాన్ని పున:నిర్మించి అభివృద్ధి బాటలో నడిపించాలనే దానికి విలువ ఇస్తున్నాం కావున పోటీ చేయట్లేదన్నారు. తాము పోటీ చేస్తే సునాయాసంగా గెలుస్తామన్నారు. కూటమి విలువలను పాటించాలి, నైతికతను రక్షించాలనే ఉద్దేశంతోనే పోటీ చేయట్లేదని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పుకొచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడే మూడు ఎమ్మెల్సీ పదవులను గెలిచిన విషయాన్ని హోంమంత్రి గుర్తు చేశారు. గెలవాలంటే తమకు పెద్ద కష్టం కాదని, హుందా రాజకీయాలు చేద్దామని సీఎం చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగుస్తోంది. 

ABOUT THE AUTHOR

...view details