సీఎం జగన్ రాష్ట్రాన్ని భ్రఘ్ట పట్టించారు : టీడీపీ నేత ఉగ్ర నరసింహా రెడ్డి - TDP Leader Ugra Narasimha Reddy - TDP LEADER UGRA NARASIMHA REDDY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 2, 2024, 11:39 AM IST
TDP Leader Ugra Narasimha Reddy Comments on YCP Goverment : సీఎం జగన్ మోహన్ రెడ్డి అయిదేళ్ల పరిపాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క ఐటీ కంపెనీ రాలేదని కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహా రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చాకిరాల గ్రామంలో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆధ్వర్యంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి పెద్దఎత్తున వలసలు కొనసాగాయి. వైసీపీ సీనియర్ నేత కుందూరు తిరుపతిరెడ్డితో పాటు 170 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. చాకిరాల గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు మరో అయిదుగురు వార్డు సభ్యులు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరిని ఆయన పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.
సీఎం జగన్ అయిదు సంవత్సరాలుగా రాక్షస పాలన కొనసాగిస్తూ, ప్రజల నుంచి సంపాదన దోచుకుంటూ, దాచుకొంటూ రాష్ట్రాన్ని భ్రఘ్ట పట్టించారని ఉగ్ర నరసింహా రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలనను అంతమొందించేందుకే వైసీపీని వీడామని కుందూరు తిరుపతి రెడ్డి పేర్కొన్నారు.