ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'టీడీపీతోనే గ్రామస్వరాజ్యం సాధ్యం'- ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన పయ్యావుల - Payyavula Keshav Election Campaign - PAYYAVULA KESHAV ELECTION CAMPAIGN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 9, 2024, 1:18 PM IST

TDP Leader Payyavula Keshav Election Campaign in Anantapur District : ఎన్నికలు సమీస్తున్న తరుణంలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్​ ప్రచార జోరును పెంచారు. సోమవారం రాత్రి అనంతపురం జిల్లా కూడేరు మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ ప్రజలకు వివరించారు. స్థానిక నాయకులతో కలిసి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.

Payyavula Keshav Comment on YCP Government : అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో గ్రామాలు అభివృద్ధికి దూరమయ్యాయని పయ్యావుల కేశవ్​ పేర్కొన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే టీడీపీతోనే సాధ్యం అవుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మౌలిక వసతుల కల్పన, మెరుగైన తాగునీటి సదుపాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే సూపర్​ సిక్స్​ పథకాలు రూపొందించామని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. 

ABOUT THE AUTHOR

...view details