LIVE: తాడేపల్లి నుంచి బయలుదేరిన కంటెయినర్ వివాదంపై టీడీపీ నేత పట్టాభి రామ్ మీడియా సమావేశం - Pattabhi Ram live
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 27, 2024, 3:15 PM IST
|Updated : Mar 27, 2024, 3:25 PM IST
LIVE: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఒక కంటెయినర్ వాహనం వచ్చి వెళ్లిన తీరు చర్చనీయాంశమైంది. మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఏపీ 16 జడ్ 0363 (AP16 Z 0363) నంబరుతో వచ్చిన ఈ వాహనంపై పోలీస్ స్టిక్కరు ఉంది. సాధారణంగా జడ్ (Z) సిరీస్ ఆర్టీసీ బస్సులకు, పీ (P) సిరీస్ పోలీసు వాహనాలకు ఉంటుంది. మంగళవారం వచ్చిన కంటెయినర్ ప్రధాన గేటు వద్ద ఎడమ వైపు రహదారిలో వచ్చినా, రెండో చెక్‌పోస్టుకు కాస్త ముందుగానే ఎడమ వైపు కాకుండా కుడి వైపు దారిలో మళ్లించి రాంగ్ రూట్లోనే క్యాంపు కార్యాలయానికి తీసుకువెళ్లారు. అందువల్ల రెండో చెకోపోస్టు వద్ద వాహనాన్ని స్కాన్ చేయలేదు. ఈ రెండో చెక్ పోస్టు ముందు నుంచి కాకుండా వెనక వైపు నుంచి ఈ వాహనం నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంది.అక్కడ ద్వారం వద్ద వాహనాన్ని వెనక్కి తిప్పి కంటెయినర్ భాగాన్ని లోపలి వైపు ఉంచారు. సుమారు గంట తర్వాత ఆ వాహనం వచ్చిన దారిలోనే వేగంగా బయటకు వెళ్లిపోయింది. ఈ కంటెయినర్ ఎందుకు వచ్చింది ? అన్ని వాహనాల్లా ఎడమ వైపు నుంచి కాకుండా వ్యతిరేక మార్గంలో వెళ్లడం, అలా వెళుతున్నా భద్రతా సిబ్బంది వాహనాన్ని ఆపకపోవడం ఇవన్నీ సందేహాలకు దారి తీస్తున్నాయి.తాడేపల్లి నుంచి బయలుదేరిన కంటెయినర్ వివాదంపై టీడీపీ నేత పట్టాభి రామ్ మీడియా సమావేశం
Last Updated : Mar 27, 2024, 3:25 PM IST