ETV Bharat / state

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం - టోకెన్ల జారీ తేదీలివే! - VAIKUNTHA DWARA DARSHAN TOKENS

జనవరి 10 నుంచి 19వ వరకు వైకుంఠ ద్వార దర్శనం - పది రోజులు సిఫార్సు లేఖలు రద్దు

ttd_darshan_tickets
ttd_darshan_tickets (ETv bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2024, 7:26 PM IST

Updated : Dec 31, 2024, 10:57 PM IST

TTD DARSHAN TICKETS : 2025 నూతన సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం రానుంది. ఈ నేపథ్యంలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల టీటీడీ ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. భక్తులు శ్రీవారి దర్శించుకునేందుకు వీలుగా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తోంది. ఈ మేరకు ఆయా కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. టీటీడీ కార్యనిర్వహణాధికారి జె. శ్యామలరావు ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు స‌మ‌న్వ‌యంతో ఏర్పాట్లలో తలమునకలయ్యారు. భక్తుల భద్రత, సౌకర్యాలకు అధిక ప్రాధాన్యమిస్తూ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వ‌ర్యంలో క్యూలైన్లు, బారికేడ్లు, షెడ్లు, భద్రత, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.

తిరుమలలో జనవరి 10 నుంచి 19వ వరకు తొమ్మిది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. సంక్రాంతి సెలవుల దృష్ట్యా లక్షలాదిగా తరలివచ్చే అవకాశాలున్న నేపథ్యంలో తిరుపతి, తిరుమలలో జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి 9న ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నారు. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో 90 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్ల ద్వారా మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు ఇవ్వనున్నారు.

దర్శనం టికెట్ బుక్ చేసుకుని వెళ్లకపోతే మరో అవకాశం? - టీటీడీ ఈవో ఏమన్నారంటే!

తిరుపతిలో టోకెన్లు ఇచ్చే కేంద్రాలివే : శ్రీనివాసం కాంప్లెక్స్‌, విష్ణునివాసం కాంప్లెక్స్‌, భూదేవి కాంప్లెక్స్‌, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో టోకెన్లు మంజూరు చేయనున్నారు. దీంతో పాటు భైరాగి పట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్‌ పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్థానికుల కోసం ప్రత్యేకంగా తిరుమల బాలాజీ నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో టికెట్లు ఇవ్వనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇక జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు ఏడు రోజుల పాటు ఏరోజూకారోజున ఒక రోజు ముందస్తుగా టోకెన్లను ఇవ్వనున్నారు.

ఈ టోకెన్లు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం, విష్ణు నివాసంలో మాత్రమే జారీ చేయనున్నారు. టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని, ఇతరులను అనుమతించేది లేదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. సామాన్య భక్తుల సౌకర్యార్థం 10 రోజుల పాటు సిఫార్సు లేఖలను రద్దు చేశారు. అయితే ప్రోటోకాల్‌ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రం శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. చంటిపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్‌ఆర్‌ఐ, రక్షణ సిబ్బంది స్పెషల్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై చంద్రబాబు కీలక నిర్ణయం

తిరుమలలో గదులు పొందడం మరింత సులభం - టీటీడీ కీలక నిర్ణయం

Last Updated : Dec 31, 2024, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.