ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాష్ట్రంలో అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం : కోట్ల సూర్య ప్రకాష్​రెడ్డి - Development in AP under YCP govt

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 2, 2024, 1:22 PM IST

TDP Leader Kotla Surya Prakash Reddy on Development in AP: రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని, తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యమని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. డోన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా (Don Constituency TDP MLA Candidate) కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ప్రకటించిన తర్వాత మొదటిసారి డోన్ పట్టణంలో కేఈ ప్రభాకర్, కేఈ శ్యాంబాబులతో కలిసి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి అంటే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని గుర్తు చేశారు. 

తెలుగుదేశం- జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని, గతంలో కేఈ, కోట్ల కుటుంబాలే డోన్​ను అభివృద్ధి చేశాయని వివరించారు. జరగబోయే ఎన్నికలలో జగన్ ఓడటం ఖాయమని ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. రాష్ట్రంలో అధికారం అండతో వైసీపీ నాయకుల అరాచకాలు పెరిగిపోయాయని వచ్చేది టీడీపీ-  జనసేన ఉమ్మడి ప్రభుత్వమేనని అప్పుడు అందరకి సమాధానం చెప్తామని సూర్యప్రకాశ్​ రెడ్డి అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details