ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జూన్‌ 4న కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుంది: కేశినేని చిన్ని - TDP LEADER KESINENI CHINNI - TDP LEADER KESINENI CHINNI

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 14, 2024, 1:28 PM IST

TDP Leader Kesineni Chinni Comment on Election Result : జూన్‌ 4న కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందని విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లంతా కసి, బాధ, కోపంతో ఎన్నికల కేంద్రాలకు వచ్చి ఓట్లేశారని తెలిపారు. ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, శ్రామికులంతా జగన్ పాలనతో విసిగిపోయారని చెప్పారు. మే 13న జరిగిన ఎన్నికల్లో వృద్ధులు, మహిళలు ఎండును సైతం లెక్క చేయకుండా ఓటు వేయడానికి బారులు తీరారని పేర్కొన్నారు. ఇది భారీ మార్పుకు సంకేతమని పేర్కొన్నారు.

అధికార పార్టీకి ఓటమి తప్పదని గ్రహించి  వైఎస్సార్సీపీ శ్రేణులు మే 13న జరిగిన ఎన్నికల పోలింగ్​లో దాడులకు తెగబడ్డారని కేశినేని చిన్ని దుయ్యబట్టారు. జూన్​ 4న ఏపీలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని జోస్యం చేశారు. సీఎంగా చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకువెళుతుందని తెలిపారు. విజయవాడ పార్లమెంటులో అన్ని స్థానాలు కూటమి కైవసం చేసుకుంటుందని కేశినేని చిన్ని స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details