ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్​ జిల్లా వద్దు కడప పేరే ముద్దు: టీడీపీ నేత గోవర్థన్​ - Change YSR District Name to Kadapa

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 10, 2024, 9:35 PM IST

TDP Leader Govardhan Want YSR District Name Change to Kadapa: వైఎస్సార్​ జిల్లా పేరును మునుపటి మాదిరిగానే కడప జిల్లాగా మార్చాలని తెలుగదేశం నేత గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. బ్రిటిష్ పాలకులే కడప జిల్లాగా పేరు పెట్టారని ఆయన అన్నారు. 200 ఏళ్లు పూర్తి చేసుకున్న కడపకు ద్విశతాబ్ది ఉత్సవాలు కూడా నిర్వహించారన్నారు. ఎంతో చరిత్ర ఉన్న కడప పేరును తొలగించి వైఎస్సార్ జిల్లాగా మార్చడం సమంజసం కాదని గోవర్ధన్ రెడ్డి ఖండించారు. జిల్లా పేరును తిరిగి మునుపటిలా కొనసాగించాలన్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు.

వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కడప పేరును తీసేసి వైఎస్సార్ జిల్లాగా మార్చేసిందని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఒక జిల్లా పేరు మార్చాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుందని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కూడా రావాల్సి ఉంటుందన్నారు. జగన్​ గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన విమర్శించారు. దోచుకోవడం దాచుకోవడమే తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. కడప జిల్లాగా పేరు మార్చకపోతే తాము ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.  

ABOUT THE AUTHOR

...view details