Live టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం - ప్రత్యక్ష సమావేశం - Bonda Umamaheswara Rao - BONDA UMAMAHESWARA RAO
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 20, 2024, 9:08 AM IST
|Updated : Apr 20, 2024, 9:32 AM IST
Tdp Leader Bonda Umamaheswara Rao Press Meet Live : శనివారం ఉదయం 9:00 గంటలకు మొగల్రాజపురంలో బొండా ఉమామహేశ్వరరావు అత్యవసర మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందుకు మీడియా మిత్రుల అందరు తప్పని కూడా హాజరు కావల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో బొండా ఉమామహేశ్వరరావు ఏం మాట్లాడతారు అనే విషయం రాజకీయ వర్గాల్లో హట్ టాపిక్ మారింది. రాత్రి బొండ ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద పోలీసుల అలజడి స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో తాజా మీడియా సమావేశంలో ఏం మాట్లాడుతారని అటు రాజకీయ వర్గాల్లో, ఇటు కార్యకర్తలు, నాయకుల్లో ఆసక్తి నెలకొంది. రానున్న ఎన్నికల్లో బొండా ఉమామహేశ్వరరావు భవిష్యత్తు కార్యచరణ గురించి చర్చించే అవకాశం ఉందని పార్టీ కార్యకర్తలు, నాయకులు మాట్లాడుతున్నారు. బొండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మీడియా సమావేశానికి వచ్చే విలేకరులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు.
Last Updated : Apr 20, 2024, 9:32 AM IST