LIVE:పెన్షన్ల పంపిణీపై టీడీపీ నేత బొండా ఉమ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - Bonda Uma media conference
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 2, 2024, 11:16 AM IST
|Updated : Apr 2, 2024, 11:26 AM IST
Bonda Uma Live: పింఛన్ల పంపిణీ జాప్యంపై ప్రతిపక్షాలు నిరసన బాట పట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం-జనసేన-బీజేపీ శ్రేణులు ఆందోళన దిగారు. సకాలంలో పింఛన్‌దారులుకు పంపిణీ చేయకుండా కావాలనే ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి సచివాలయ సిబ్బందితో పింఛన్ పంపిణీని చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై బురద జల్లేందుకే ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని వైసీపీ రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు.టీడీపీ వల్లే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిపోయిందని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పింఛన్లను ఇంటింటికీ వెళ్లి ఇచ్చేందుకు తాము వ్యతిరేకం కాదని ఎన్డీయే నేతలు తెలిపారు. వాలంటీర్లు అందరూ తమ వాళ్లే అని గతంలో వైసీపీ నేతలే చెప్పారన్న నేతలు తమపై దుష్ప్రచారం చేసేందుకు కావాలనే కుట్రలు చేస్తున్నారన్నారు. వాలంటీర్లను వినియోగించాల్సిన అవసరం లేకుండా పింఛన్ల పంపిణీపై సీఎస్, సర్ప్ సీఈవో బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో పింఛన్లను ఇంటింటికీ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై టీడీపీ నేత బొండా ఉమ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం
Last Updated : Apr 2, 2024, 11:26 AM IST