LIVE: టీడీపీ నేత బొండా ఉమా మీడియా సమావేశం- ప్రత్యక్షప్రసారం - TDP Leader Bonda Uma Live
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 20, 2024, 12:07 PM IST
|Updated : Mar 20, 2024, 12:27 PM IST
TDP Leader Bonda Uma Media Conference Live: రాష్ట్రంలో అధికార వైసీపీకి కొమ్ముకాస్తున్న కొందరు కలెక్టర్లు, ఎస్పీలపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీసం ఏడుగురు జిల్లా కలెక్టర్లు, 14 మంది ఎస్పీలు, కమిషనర్లపై ఎన్నికల సంఘానికి సమగ్ర నివేదిక వెళ్లినట్లు సమాచారం. ప్రధాని సభలో భద్రతా వైఫల్యానికి పల్నాడు, ప్రకాశం జిల్లాల ఎస్పీలు మూల్యం చెల్లించుకోక తప్పదనే వాదన వినిపిస్తోంది. ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుంచి నివేదిక తెప్పించుకున్న కేంద్ర ఎన్నికల సంఘం సదరు అధికారులపై కొరడా ఝళిపించే అవకాశాలున్నాయి. తూర్పుగోదావరి, గుంటూరు, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాల కలెక్టర్లు అధికార పార్టీ అగ్రనేతలతో అంటకాగుతున్నారని ఎప్పట్నుంచో ఫిర్యాదులు వచ్చాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా వారు తీరుమార్చుకోకుండా కొందరు పోటీపడి స్వామి భక్తి చాటుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, విజయవాడ జిల్లాల ఎస్పీలతోపాటు నగర పోలీస్ కమిషనర్ సైతం వైసీపీకి అనుకూలంగా ఉన్నారంటూ ప్రతిపక్షాలు కూడా నేరుగా ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో ఈ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించగలరా అని ఈసీ సంశయిస్తోంది.! ఎన్నికల కోడ్ అమలులో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయాన్నీ కొందరు కలెక్టర్లు వైసీపీ పెద్దలకు చేరవేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బొండా ఉమా మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Mar 20, 2024, 12:27 PM IST