ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి మీడియా సమావేశం- ప్రత్యక్షప్రసారం - TDP Leader Anam Press Meet - TDP LEADER ANAM PRESS MEET

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 16, 2024, 11:22 AM IST

Updated : Apr 16, 2024, 11:30 AM IST

TDP Leader Anam Venkata Ramana Reddy Press Meet Live: సీఎం జగన్ మోహన్ రెడ్డి, భారతి వ్యాపారంలో దేశంలో అపర మేథావులని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు. సరస్వతీ పవర్ కంపెనీ పేరుతో 1999లో కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి 2009లో 32 కోట్లుకు షేర్ క్యాపిటల్ చేశారని అన్నారు. 2009లో జగన్ 87లక్షల 8వేలు, భారతీ 80 లక్షలు సరస్వతీ పవర్​లో పెట్టుబడులు పెట్టారు. 60 రోజుల్లోనే 18 కోట్ల 87లక్షలకు షేర్ వాల్యూ ఏ విధంగా పెంచగలిగారో అర్థం కావడం లేదని, ఈ మ్యాజిక్ ఏలా సాధ్యం అయ్యిందని ఆనం ప్రశ్నించారు. వారు చెప్పే సరస్వతీ కంపెనీకి కార్యాలయమే లేదని, కనీసం గోడ గుడిసే కూడా లేదని, షేర్ వాల్యూ మాత్రం భారీగా పెరిగిందని ఆరోపించారు. కంపెనీ ఉత్పత్తులు లేవని, టర్నవర్ లేని కంపెనీకి ఇంత ఆదాయం ఎలా సాధ్యమైందో జగనే చెప్పాలని ఆనం పేర్కొన్నారు. సొంత వారిని అందలమెక్కించడమే జగన్ రెడ్డి సామాజిక న్యాయం అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జి.దీపక్ రెడ్డి విమర్శించారు. ఈ నేపథ్యంలో  మీడియా సమావేశం టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Apr 16, 2024, 11:30 AM IST

ABOUT THE AUTHOR

...view details