ఒకే జాతి పక్షులన్నీ ఒక గూటికి చేరినట్లు సైకోలంతా జగన్ పంచన చేరారు: కేశినేని - వైఎస్సార్సీపీపై టీడీపీ నేతలు ఫైర్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 12:35 PM IST
TDP Kesineni Chinni Fire on MP Kesineni Nani: ఎంపీ కేశినేని నానికి మతి భ్రమించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని ధ్వజమెత్తారు. ఒకే జాతి పక్షులన్నీ ఒక గూటికి చేరినట్లు సైకోలంతా జగన్ పంచన చేరారని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ప్రజలు ఇంటికి పంపిస్తారన్న ఆయన.. తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా జీవితం నుంచి కేశినేని నాని కనుమరుగవటం ఖాయమని కేశినేని చిన్ని హెచ్చరించారు. కాగా తిరువూరులో ఇటీవల కేశినేని నాని.. అసలు కేశినేని చిన్ని ఎవరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
"ఎంపీ కేశినేని నానికి మతి భ్రమించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఒకే జాతి పక్షులన్నీ ఒక గూటికి చేరినట్లు సైకోలంతా జగన్ పంచన చేరారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. ప్రజా జీవితం నుంచి కేశినేని నాని కనుమరుగవటం ఖాయం." - కేశినేని చిన్ని, టీడీపీ సీనియర్ నేత