తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : మంగళగిరిలో జయహో బీసీ బహిరంగ సభ - మంగళగిరిలో జయహో బీసీ బహిరంగ సభ

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 6:59 PM IST

Updated : Mar 5, 2024, 7:47 PM IST

TDP Jayaho BC Public Meeting Live : వెనకబడిన వర్గాల సమగ్రాభివృద్ధి, పూర్తి స్థాయి సామాజిక న్యాయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ - జనసేన పార్టీలు ఉమ్మడిగా నేడు బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన జయహో బీసీ వేదికపై రెండు పార్టీల చంద్రబాబు (Chandrababu Naidu), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) డిక్లరేషన్‌ ప్రకటిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టబోయే వివిధ అంశాలను ప్రస్తావిస్తూ  బీసీ డిక్లరేషన్‌ (BC Declaration) రూపొందించారు. టీడీపీ పాలనలో బీసీలకు ఆర్థిక చేయూత అందించేందుకు 4.20 లక్షల మందికి ఆదరణ పథకం కింద పనిముట్లు పంపిణీ చేశారు. సంక్షేమానికి తోడుగా ఉప ప్రణాళిక కింద 36వేల కోట్లకు పైగా వివిధ పథకాలకు ఖర్చు చేశారు. బీసీలకు అనేక పథకాలు అందించి ఆర్థికంగా చేయూతనిచ్చారు. బీసీలకు మరింత ప్రాధాన్యం కల్పించేందుకు తెలుగుదేశం జనవరి 4 నుంచి జయహో బీసీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మంగళగిరిలోని నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ బహిరంగ సభ ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Mar 5, 2024, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details