ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విలేకరులపై దాడి చేసే హీన స్థితికి జగన్‌ దిగజారిపోయాడు: దేవినేని ఉమ - ysrcp siddham meetings

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2024, 9:30 PM IST

TDP Devineni Uma Fires on CM YS Jagan: వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలను అడ్డం పెట్టుకొని సిద్ధం సభలు పెట్టుకుని తొడలు కొట్టుకుంటే ప్రజలు ఊరుకోరని దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. జగన్‌ చెప్పే లక్షల కోట్లు, ఎవరి అకౌంట్లో ఎంత డబ్బులు పడ్డాయో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా అని ఆయన నిలదీశారు. జగన్‌మోహన్ రెడ్డి నొక్కిన బటన్లలో కోట్ల రూపాయల బొక్కుడు ఉందని ఉమా ఆరోపించారు. జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో ఈ కౌరవులను తరిమి తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. 

పరదాలు కట్టుకుని చెట్లు కొట్టేసి వేలాది వాహనాలతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ సభలు పెడుతున్నారని దుయ్యబట్టారు. విలేకరులపై దాడులు చేసే హీనస్థితికి జగన్ మోహన్ రెడ్డి దిగజారిపోయాడు ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అని ఉమా మండిపడ్డారు. అదే విధంగా 21వ తేదీన రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట నుంచి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని తెలుగుదేశం నాయకులు కేశినేని శివనాథ్ (చిన్ని), తాను నిర్వహిస్తామని దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details