ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: రాజమహేంద్రవరం రూరల్​లో 'రా కదలిరా' సభ - ప్రత్యక్షప్రసారం - Chandrababu Raa Kadali Ra Live

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 11:57 AM IST

Updated : Jan 29, 2024, 1:46 PM IST

TDP Chandrababu Raa Kadali Ra Public Meeting Today Live: తెలుగుదేశం "రా కదలి రా" బహిరంగ సభకు రాజమహేంద్రవరం, పొన్నూరులో భారీ ఏర్పాట్లు చేశారు. పొన్నూరు నియోజకవర్గం నారాకోడూరు సమీపంలోని వడ్లమూడి క్వారీ సెంటర్‌ వద్ద.. సువిశాల ప్రదేశంలో మధ్యాహ్నం 2 గంటలకు సభ జరుగనుంది. అంతుకుముందు రాజమహేంద్రవరం పరిధి కాతేరులో  'రా కదలిరా' సభలో టీడీపీ అధినేత పాల్గొననున్నారు. సార్వత్రిక ఎన్నికల ముంగిట జరిగే ఈ బహిరంగ సభకు సమీప నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివస్తారనే అంచనాలతో ఏర్పాటు చేశారు. 

పార్టీ అధినేత చంద్రబాబు హాజరుకానుండటంతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సుమారు 2 లక్షల మంది సభకు వస్తారని.. జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. వైఎస్సార్సీపీ అరాచక పాలన అంతమే లక్ష్యంగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఏర్పాటు చేసిన సభలో అందరూ పాల్గొనాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నేడు రాజమహేంద్రవరం పరిధి కాతేరులో 'రా కదలిరా' సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యక్ష ప్రసారం.

Last Updated : Jan 29, 2024, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details