టీడీపీ బీసీ డిక్లరేషన్ కమిటీ సమావేశం- ఈ నెల 5న భారీ బహిరంగ సభ - BC Declaration public meeting
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 4, 2024, 4:53 PM IST
TDP BC Declaration Committee Meeting in Vijayawada : గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అధ్యక్షతన బీసీ డిక్లరేషన్ కమిటీ సమావేశం (Meeting) నిర్వహించారు. బీసీ డిక్లరేషన్‌లో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో బీసీలు దారుణంగా మోసపోయారని ఆరోపించారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు.
TDP public meeting on March 5 About BC Declaration : జగన్ చేసిన మోసం నుంచి కోలుకుని ఎదిగేలా ప్రోత్సహించడమే టీడీపీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రేపు (మంగళవారం) నాగార్జున యూనివర్సిటి ఎదురుగా భారీ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ మీటింగ్‌లో టీడీపీ రాష్ట్ర శాసన సభ సభ్యుడు కింజరాపు అచ్చెంనాయుడు (Kinjarapu Atchannaidu) సహా పలువురు నేతలు పాల్గొన్నారు. బీసీ డిక్లరేషన్ (BC Decleration)పైనా చర్చించిన్నట్లు సమాచారం.