ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

టీడీపీ విభిన్న ప్రతిభావంతుల నియామకం - ప్రకటన విడుదల చేసిన అచ్చెన్నాయుడు - టీడీపీ విభిన్న ప్రతిభావంతుల నియామకం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 5, 2024, 10:42 AM IST

TDP Appointed Several Committee Members in Vijayawada : తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన మన్నవ శారదాదేవిని పార్టీ నియమించింది. తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధిగా యలమంచిలికి చెందిన అడారి జానకిని, కావలికి చెందిన పోతుగంటి అలేఖ్య, టెక్కలికి చెందిన మెట్ట పద్మావతిని కార్యదర్శులుగా నియమించారు. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వారిని తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం, ముస్లిం మైనార్టీ, వాణిజ్య విభాగాల రాష్ట్ర కమిటీల్లోకి తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.

విభిన్న ప్రతిభావంతుల విభాగానికి ఆరుగురు అధికార ప్రతినిధులు, ఇద్దరు కార్యదర్శుల్ని, ముస్లిం మైనార్టీ విభాగం రాష్ట్ర కమిటీలోకి ఒక ఉపాధ్యక్షుడు, ముగ్గురు ప్రధానకార్యదర్శులు, ఇద్దరు అధికార ప్రతినిధులు, అయిదుగురు కార్యనిర్వాహక కార్యదర్శులు, ఎనిమిది మంది కార్యదర్శుల్ని నియమించారు. వాణిజ్య కమిటీలోకి ఆరుగురు ఉపాధ్యక్షులు, ఒక ప్రధానకార్యదర్శి, ఇద్దరు అధికార ప్రతినిధులు, 10 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 8 మంది కార్యదర్శుల్ని నూతనంగా తీసుకొన్నారు.

ABOUT THE AUTHOR

...view details