4వ తేదీ ఎడవాల్సిన ఏడుపులు ఇప్పుడే ఏడుస్తున్నారు: టీడీపీ - TDP leader Devineni Uma Comments - TDP LEADER DEVINENI UMA COMMENTS
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 28, 2024, 8:25 PM IST
|Updated : May 28, 2024, 8:33 PM IST
TDP leader Devineni Uma Comments on YSRCP: కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలని రాష్ట్రమంతా కోరుకుంటుంటే, వైఎస్సార్సీపీ నేతల పిల్లి శాపనార్థాలేంటి అని టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. 4వ తేదీ సాయంత్రం ప్రెస్మీట్ పెట్టి ఎడవాల్సిన ఏడుపులు ఇప్పుడే ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎస్ ఉంటే ఫలితాలపై ప్రభావం పడుతుందని ఆరోపించారు. ఆ స్థానం నుంచి ఆయను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే చాలా మంది వైఎస్సార్సీపీ నేతలు విదేశాలకు సామగ్రితో సహా సర్దేశారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ దుకాణం బంద్ అయ్యాక కూడా పిచ్చి ప్రేలాపనలతో అధికారుల్ని భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. సీఎస్ ఆధ్వర్యంలో జరిగిన భూ దందా బట్టబయలు అయ్యాక కూడా అసత్య ఆరోపణలు అనటం సిగ్గుచేటని దేవినేని ఉమా ఆక్షేపించారు. జగన్ చెప్పినట్లుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఆశ్చర్యపోతుందని జోస్యం చెప్పారు. పోలింగ్ రోజే తెనాలి ఎమ్మెల్యేకు తగిలిన చెంప దెబ్బ, మాచర్లలో పగిలిన ఈవీఎం ఘటనలతో దేశం అంతా ఆశ్చర్యపోయిందని దేవినేని ఉమా పేర్కొన్నారు.