ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎన్నడూలేని విధంగా పన్నులు విధిస్తున్న వైసీపీ- భారం తగ్గించే పార్టీకే మద్దతు: ట్యాక్స్‌ పేయర్స్‌ - Taxes burden on people Vijayawada

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 5:57 PM IST

Tax Payers Association Leaders on YCP Govt: గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ పాలక మండలి విజయవాడ నగర ప్రజలపై పన్నులు భారం వేస్తోందని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు విమర్శించారు. చెత్తపన్ను, ఇంటిపన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలాల పన్నుల పేరుతో నగర ప్రజలపై మరింత ఆర్థిక భారం వేస్తోందని మండిపడ్డారు. పన్నుల వసూలపై ఉన్న శ్రద్ధ నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో పాలక మండలికి లేదని దుయ్యబట్టారు. నగర ప్రజలకు కృష్ణా నది పక్కనే ఉన్నా కావాల్సినన్ని మంచినీళ్లు ఇవ్వడంలో వైసీపీ పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలను పట్టించుకోవట్లేదని అన్నారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం ప్రతీ రాజకీయ పార్టీకి వినతులు సమర్పిస్తామని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. పన్ను చెల్లింపుదారులపై ఆర్థిక భారం వెయ్యమని స్పష్టమైన హామీ ఇచ్చే పార్టీకే వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details